మహబూబాబాద్ : భారీగా నిషేధిత గుట్కా, అంబర్ పాకెట్లను మానుకోట టాస్క్‌ఫోర్స్, టౌన్ పోలీసులు బుధవారం ఉదయం సంయుక్తంగా దాడులు చేసి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐ వెంకటరత్నం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు, మహబూబాబాద్ టౌన్ పోలీసులు మహబూబాబాద్ పట్టణంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద సుమారు రూ.5.51లక్షల విలువ చేసే నిషేధిత అంబర్లు, గుట్కా పాకెట్లను గుర్తించారు. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. గత కొంత కాలంగా ఇద్దరు బీదర్ నుంచి వీటిని కొనుగోలు చేసి మహబూబాబాద్ పట్టణంలో వివిధ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఈ మేరకు గోపాలపుర్ గ్రామానికి చెందిన మాసిని సాయి, అదే విధంగా రాంచంద్రాపురానికి చెందిన జమీరోద్ధిన్ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ జే వెంకటరత్నం, మహబూబాబాద్ టౌన్ సిఐ వై సతీష్, టాస్క్ పోర్స్ ఎస్ఐ కే శివ, ఏఎస్ఐ రహమత్ అలి, పిసి రాజప్ ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital