Monday, November 18, 2024

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

జనగామ : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల ఆవరణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు..ఈ సందర్బంగా క్యాంపున‌కు సంబంధించిన స్టాల్స్ ని ఆయన పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ కు ధీటుగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. పేదల కోసమే ప్రభుత్వం బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ లాంటి ప్రభుత్వ పథకాలతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. మెగా హెల్త్ క్యాంపు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వైద్య సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే :
మెగా క్యాంపును ఇంతగొప్పగా నిర్వహిస్తున్న డిఎంహెచ్ఓ మహేందర్ తో పాటు వైద్యులు శ్రీవాణి, వైద్య ఆరోగ్య సిబ్బందిని ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సురేష్, వైద్యులు శ్రీవాణి, నాయకులు ప్రసాద్, మల్లేష్, ఎఎన్ఎం లు, ఆశావర్కర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement