Tuesday, November 26, 2024

హరితహారం చెట్లు ఆవులపాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెర్వాయి గ్రామంలోని హరితహారంలో నాటిన మొక్కులు నాశనం అవుతున్నాయి. పశువులు మొక్కలను తిని నాశనం చేస్తున్నా.. స్థానిక  సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం హరితహారం పేరుతో వెచ్చించిన కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తూన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరితహారానికి సరైన రక్షణ లేక పశువులు హరితహారం మొక్కలను పూర్తిగా నాశనం చేశాయన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్, కార్యదర్శిలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement