Tuesday, November 26, 2024

వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ లుగా గుండు సుధారాణి, రిజ్వనా షమిమ్

.వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గా 29 వ డివిజన్ టిఆర్ ఎస్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు ప్రతిపాదించారు . 18వ డివిజన్ కార్పొరేటర్ పస్కుల బాబు బలపరిచారు • బీజీపీ, కాంగ్రెస్, నుంచి ఎవరూ పోటీ చేయలేదు., ప్రమాణ స్వీకారం అయిన తదుపరి బీజీపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం నుండి వెళ్లిపోయారు. స్వతంత్ర కార్పొరేటర్లు మౌనంగా ఉండి పోయారు. ఇతర పార్టీల నుండి ఎవ్వరు పోటీలో లేనందున జిడబ్ల్యూ ఎంసి మేయర్ గా గుండు సుధారాణి ఏకగ్రీకంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు . అనంతరం డిప్యూటీ మేయరుగా టీఆర్ఎస్ అభ్యర్థిని 39వ డివిజన్ టిఆర్ ఎస్ కార్పొరేటర్ రిజ్వనా షమిమ్ మసూద్ పేరును 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ప్రతిపాదించగా , 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు బలపరిచారు .ఇతర పార్టీల నుండి ఎవ్వరు పోటీలో లేనందున జిడబ్ల్యూ ఎంసి ఉప మేయర్ గా రిజ్వనా షమిమ్ మసూద్ ఏకగ్రీకంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు . సాయంత్రం 4 గంటలకు రెండు ఎన్నికలు పూర్తయ్యాయి . అనంతరం మేయర్ , డిప్యూ టీ మేయర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement