Tuesday, November 26, 2024

ఆరుగంటల కరెంట్ ఇవ్వలేని దద్దమ్మలు బీజేపీ నాయకులు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ : గుజరాత్ లో ఆరుగంటల కరెంట్ ఇవ్వలేని దద్దమ్మలు బీజేపీ నాయకులని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు..శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని విశ్వనాథపూర్ గ్రామంలో ఓరుగల్లు డిస్ట్రిక్ కోఆపరటివ్ మార్కెటింగ్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్ట మొదటి యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు..ఈ సందర్భంగా వడ్ల రాశి పై గులాబీ రంగులో జై కెసీఆర్ అని రాయడం అందరిని ఆకట్టుకున్నది..ఈ సందర్బంగా పల్లా మాట్లాడుతూ… బియ్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని, కేంద్రం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంద‌న్నారు. కరువు, కాటకాల్లో, అత్యవసర, యుద్ధ సమయంలో కేంద్రం బాధ్యత తీసుకుంటుందన్నారు. కానీ తెలంగాణలో యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులు ఎత్తేసిందని తెలిపారు. సీఎం స్వయంగా కేంద్రానికి లేఖ రాసిండ్రు.. మంత్రులు స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కూడా కలిశారని పేర్కొన్నారు.1500 మిల్లులను నిలుపలేము.. లక్షలాది మంది రైతులను ఆపలేమని చేప్పినాము.. అయినా కేంద్రం మొండికేసిందని తెలిపారు..సీఎం కేసీఆర్ మాత్రం నష్టం వచ్చినా కొనాలని నిర్ణయించారు. గుజరాత్ లో ఆరుగంటల కరెంట్ కూడా ఇవ్వలేని దద్దమ్మలు సీఎం కేసీఆర్ మీద కొట్లాడటం కాదు.. మీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ మీద కొట్లాడండి అని రాష్ట్ర బీజేపీ నాయకులకు సూచించారు..

  • రైతు బంధావుడు సీఎం కేసిఆర్ : ఎమ్మెల్యే రాజయ్య
    రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రైతు బాంధవుడు కేసీఆర్ అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య కొనియాడారు.. గ్రామస్థాయిలోనే నేరుగా రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొంటున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ క్రిష్ణవేణి, ఎంపీపీ కందుల రేఖ, జడ్పిటిసి మారపాక రవి, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మండలపార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, సర్పంచ్ మల్లేశం, మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, దిశా కమిటీ సభ్యులు మాలోత్ రమేష్ నాయక్, మార్కెట్ డైరెక్టర్ లు హరీష్, రాజన్ బాబు, వరుణ్, రాజ్ కుమార్, సరిత, నాయకులు గుర్రం నర్సింహులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement