మొగుళ్లపల్లి (ప్రభ న్యూస్) : ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం చింతలపల్లి తాటి వనంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన గడ్డం పెద్ద కొమురయ్య (55) అనే గీత కార్మికుడు వృత్తిరీత్యా బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో చింతలపల్లి గ్రామంలోని తాటి వనంలో తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అక్కడే ఉన్న తోటి గీతా కార్మికులు కుటుంబీకులకు సమాచారం అందించగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన పరకాల పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన కాళ్లు, చేతులు విరిగిపోయాయని, నడుము వెన్ను పూస బొక్కలు విరిగి పోవడంతో ఆయన పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్నాడని, గీతా వృత్తినే నమ్ముకుని బ్రతుకుతున్న ఆయన కుటుంబం వీధినపడ్డదని, ఆయన కుటుంబానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని గౌడ ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి రవీందర్ గౌడ్, మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోల్లపల్లి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి చర్లపల్లి శ్రీధర్ గౌడ్ లు డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital