ములుగు : గట్టమ్మ ఎదురు పిల్ల పండుగను ఆదివాసీ నాయకపోడ్ పూజారులు వారి సంస్కృతి, సంప్రదాయాలతో అట్టహాసంగా నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ములుగు డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ నుండి గట్టమ్మ దేవాలయం వరకు ఆదివాసుల నృత్యాలతో, 101 బోనాలతో ర్యాలీగా వచ్చి పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..