భారీ స్థాయిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్, దామెర పోలీసులు సంయుక్తంగా కల్సి (శనివారం) అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు 50 లక్షల విలువ గల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజీ సహదేవ్ (29), జై యోగేశ్వర్ (27), సోమనాదత్ రాందాస్ కలాటి (24)లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మరో ముగ్గురు నిందితులు పాండు, లక్ష్మి తాటే, వికాస్ తాటే పరారీలో ఉన్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ… నిందితుడు గజ్జి సహదేవ్ కారుడ్రైవర్ గా జీవనం కోనసాగిస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు మండలం, తునగొండ గ్రామ పరిసరాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఇదే తరహాలో గజ్జి సహాదేవ్ తో సహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.