Wednesday, November 20, 2024

WGL: అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్..

డోర్నకల్, ఆగస్టు 20( ప్రభ న్యూస్) : అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డోర్నకల్ సీఐ బి.రాజేష్, ఎస్ఐ, సిబ్బంది ఆర్.సైదులు, సూర్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ తో కలిసి మంగళవారం డోర్నకల్ పట్టణ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ బొమ్మ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ట్రాలీ వాహనం పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకుని విచారించారు. ఆ వాహనంలో రెండు మోటార్లు, రెండు స్కూటీలు ఉండగా.. తదుపరి విచారణలో వాళ్లు గత నాలుగు నెలల నుండి వివిధ ప్రాంతాల్లో కరెంట్ మోటార్ లు, ఇనుప వస్తువులు దొంగతనాలు చేస్తున్నట్లు తెలుపగా.. పోలీసులు వారి వద్ద నుండి ముందుగా 2 మోటర్లు, 2 స్కూటీ బైక్ లు, ఓ వాహనం ట్రాలీ, రూ.70,000 వేలను నిందితుడు ఏ5 తేజవత్ జవహర్లాల్ ఇంటివద్ద మొత్తం 19 మోటార్ లు స్వాధీన పరుచుకున్నారు.


నిందితుల వివరాలు…
మామిళ్లగూడెం ఖమ్మంకి చెందిన వీరబోయిన ముత్యాలు, కొట్టే గణేష్, తేజావత్ సదర్ లాల్, రఘునాధపాలెం మండలం వేపకుంట్లకు చెందిన మొగిలి నాగరాజు, గానుగపాడు విలేజ్ చంద్రుగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇస్లావత్ సిద్ధూ, పువ్వాడ ఉదయం నగర్ కాలనీ రఘునాథపాలెం మండలం తేజావత్ జోహార్ లాల్. వీరిలో మొగిలి నాగరాజుపై ఖమ్మం 3 టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. తేజావత్ సోదరులాల్ పై కొనిజర్ల పీఎస్ లో కేసు నమోదైంది. వీరబోయిన ముత్యాలుపై ఖమ్మం రూరల్ పీఎస్ లో ఒక కేసు నమోదైంది. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

స్వాధీన పరచుకున్న సొత్తు వివరాలు…
19 బావి ఎలక్ట్రిక్ మోటార్లు, టీఎస్ 04 యుడి 7897 నెంబర్ గల ఓ వాహనం ట్రాలీ, నెంబర్ లేని స్కూటీ, టీఎస్ 04 FA 8726, 70,000/- నగదును పట్టుకున్నారు. పైన తెలిపిన నిందితులు సులువుగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఒక గ్యాంగ్ గా తయారై గత 4 నెలల నుండి మహబూబాబాద్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో మొత్తం 19 మోటర్లు దొంగలించారు. టన్నున్నర ఐరన్ రాడ్లను కూడా దొంగతనం చేశారు.

- Advertisement -


ప్రధాన నిందితురాలు ముత్యాలు మోటారు దొంగతనం చేయాలని తన స్నేహితురాలైన నాగలక్ష్మి ట్రాలీ వెహికల్ ను కిరాయికి తీసుకొని పైన నిందితులతో కలిసి దొంగతనానికి పాల్పడుతున్నారు. అటు మోటార్లను ఖమ్మం పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తేజావత జవహర్లాల్ ఇంటి వద్ద దాచి ఉంచి, 10రోజుల క్రితం చోరీకి పాల్పడిన మోటర్లను ఆరోజు ఎవరో వెంటపడుతున్నట్లు అనిపించి డోర్నకల్ మండలంలోని సమ్మక్క సారక్క దేవాలయం పక్కన చెట్ల పోదల్లో దాచిపెట్టి వాటిని తీసుకొని వెళ్ళుటకు రాగా దొంగలను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ రామ్నాథ్ కేకన్ మీడియా సమావేశంలో తెలిపారు.

నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు..
మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ మండలంలో మొత్తం ఏడు మోటార్లు టన్నున్నర ఇనుప రాడ్లు, కురవి మండలం రెండు మోటార్లు, నర్సింహులుపేట మండలంలో ఒక మోటర్. ఖమ్మం జిల్లా నుండి రఘునాథపాలెం మండలంలో ఐదు మోటార్లు, చింతకాని మండలంలో రెండు మోటార్లు, తల్లాడ మండలంలో ఒక మోటారు, ఖమ్మం రూరల్ పరిధిలో ఒక మోటారును దొంగలించారని, వీటి మొత్తం విలువ సుమారు 4,54000 ఉంటుందని ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలిపారు. అనంతరం చోరీకి పాల్పడిన మోటార్లను, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వివిధ వాహనాలను పరిశీలించి, పలువురు పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ తిరుపతి, స్థానిక ఎస్సైలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement