Thursday, November 21, 2024

మది నిండా.. మువ్వన్నెల జెండా… జ‌న‌గామలో ఫ్రీడమ్ రన్..

జనగామ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నాలుగోవ రోజు పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొనసాగిన ఫ్రీడం రన్ కు పట్టణ ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు,స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు, యువకులు జాతీయ పతాకాలతో మది నిండా జాతీయ సమైక్యతను నింపుకొని.. జై జై మాత.. భారత మాత.. జై జవాన్… జై కిసాన్.. అంటూ వంటి నినాదాలతో మరోమారు పట్టణం మారుమోగింది. పట్టణంలోని వీధులన్నీ పోలీసు అధికారులు తమ ఆధీనంలో తీసుకొని ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

ఫ్రీడం రన్ ను ప్రారంభించిన కలెక్టర్
జాతీయ సమైక్యత స్ఫూర్తి నిస్తున్న కార్యక్రమానికి రైల్వే స్టేషన్ వద్ద జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డిసిపి సీతారాం, మున్సిపల్ చైర్మన్ పోకల జమున,అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఫ్రీడం రన్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ తో పాటు శాసనసభ్యులు, డిసిపి, పలువురు ప్రముఖులు అధికారులు రన్ లో పాల్గొని ప్రతి ఒక్కరిలో జాతీయ సమైక్యత స్ఫూర్తి రగిలించారు. పట్టణమంతా పరిశుభ్రంగా తీర్చిదిద్ది ఫ్రీడం రన్ కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ ఫ్రీడమ్ రన్ లో జెడ్పి సీఈవో విజయలక్ష్మి,ఆర్డీవో మధుమోహన్, ఏసీపీ క్రిష్ణ, సీఐ శ్రీనివాస్ యాదవ్,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు,యువత,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement