వాజేడు : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆదివారం వరద బాధిత గ్రామాలలో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని వరద బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు. ఒక్కొక్క వరద బాధ్యత కుటుంబానికి ఐదు కేజీల బియ్యం మూడు రకాల కూరగాయలు అందజేశారు. గోదావరి వరద ముంపుకు గురైన ఇండ్ల బాధితులకు తెలంగాణ ప్రభుత్వం నేరుగా తమ ఖాతాలో పదివేల రూపాయలు జమ చేస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాజేడు టీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండలంలోని వాజేడు నాగారం దూలాపురం గుమ్మడ దొడ్డి ఇప్పగూడెం సుందరయ్య కాలనీ చీకుపల్లి పెద్ద గొల్లగూడెం కృష్ణాపురం టేకులగూడెం చుండ్రుపట్ల తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. చందుపట్ల గ్రామంలో గోదావరి వరదలకు కొట్టుకుపోయిన రహదారులను పరిశీలించారు. గోదావరిపై నిర్మించిన సమ్మక్క సారక్క బ్యారేజ్ వలన టేకులగూడెం చంద్రుపట్ల పేరూరు గ్రామాలకు ముప్పు పొంచి ఉందని టేకులగూడెం నుండి పేరూరు గ్రామం వరకు గోదావరి పొడవున కరకట్ట నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకటరావు మార్కెట్ కమిటీ చైర్మన్ బోధ బోయిన బుచ్చయ్య ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి వాజేడు ఎంపీపీ శ్యామల శారద జడ్పిటిసి పల్లడి పుష్పలత భద్రాచలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు హరికిల్ల తిరుపతిరావు వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్ల కృష్ణారెడ్డి యూత్ అధ్యక్షులు ముడిగ తిరుపతి సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు