Thursday, November 21, 2024

బాలుర హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత

గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బాలుర వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు రోజువారిలా ఆహారం సేవించి పాఠశాలకు వెళ్లగా మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఫుడ్ పాయిజన్ అయిందని దాంతో ఒక్కసారిగా కడుపులో నొప్పి.. విరేచనాలు అవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లి వైద్యం చేయించుకోవడం జరిగిందని విద్యార్థులు రామ్ చరణ్, బబ్లులతో పాటు తదితర విద్యార్థులు తెలిపారు. బియ్యం సరిగా లేనందువల్ల వర్కర్లు అన్నం ముద్దముద్దగా వండడంతో ఆ అన్నం తినడం వల్ల కడుపులో నొప్పి రావడం జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న వసతిగృహ అధికారి ఈసం స్వామి విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన గురై తమ పిల్లలను ఇంటికి తీసుకెళుతున్నట్లు సమాచారం. ీ విషయమై వసతిగృహ అధికారి ఈసం స్వామిని వివరణ కోరగా.. బియ్యం మంచిగా లేనందువలనే ఈ సంఘటన చోటు చేసుకుందని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement