మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అటవీ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో చేపలు ప్రత్యక్షమవడంతో జనాలు ఆశ్చర్య పోతున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి అడవీ ప్రాంతంలో చేపలు ప్రత్యక్షం కావడంతో, ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనబడటంతో చేపలను పట్టుకున్నారు. అనంతరం ఉపాధిహామీ కూలీలు మాట్లాడుతూ ఇప్పటివరకు ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదని ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో అని, ఆశ్చర్యానికి గురవుతున్నామన్నారు. కాగా ఆదివారం కురిసింది చేపల వాన కావచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement