వడ్డేపల్లి .. (ప్రభన్యూస్) : హనుమకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ మొదటి అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెడ్లు, ఫర్నిచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయినవి, ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. పేషంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 101 డయల్ ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.