వరంగల్ హంటర్ రోడ్డు లోని జూ పార్క్ లో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో సిబ్బంది స్పందించడం, అంతే వేగంతో ఫైర్ ఇంజన్ రావడంతో ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. దాంతో ఎవ్వరికీ ఎలాంటి నష్టం జరుగలేదు. హంటర్ రోడ్డులోని జూ పార్క్ లో సోమవారం మధ్యాహ్నం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. జూ పార్క్ మధ్యలో ఉన్న ఎండు. గడ్డి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురి అయింది. అసలే వేసవికాలం,ఆపై మండుటెండ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించారు. ఒకవైపు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూనే,మరో వైపు ఎండు గడ్డి ని మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైర్ ఇంజన్ సైతం రావడంతో ఎగిసి పడుతున్న మంటలను అర్పి వేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిన్నట్లు అయ్యింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.అలాగే జూ పార్క్ లోని పశు పక్ష్యాదులకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా చూడటంతో జూ అధికారులు సక్సెస్ అయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement