Thursday, November 21, 2024

WGL | కష్టాల్లో ఉన్న మిత్రునికి ఆర్థిక సాయం..

కమలాపూర్, అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ) : కొద్దిరోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి దుఃఖంలో ఉన్న చిన్ననాటి మిత్రునికి మేమున్నాం మీకు అండ అంటూ చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సాయం అందించి భరోసా నింపారు. కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 1994- 95 బ్యాచ్ కు చెందిన అట్ల చంద్రమౌళి ఇటీవల కొద్దిరోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయారు.

అనారోగ్యం కారణంగా తన తల్లిదండ్రులు అట్ల ఎల్లయ్య, కొమరమ్మలు కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్నేహితులు తన చిన్ననాటి మిత్రుడు చంద్రమౌళి కష్టాల్లో ఉన్నాడని స్పందించి.. అతన్ని ఆదుకోవాలనే సంకల్పంతో తోచిన సహాయాన్ని జమచేశారు.

శనివారం మిత్రుడు చంద్రమౌళి ఇంటి వద్దకు వెళ్లి అతన్ని పరామర్శించి, ఓదార్చి 50కిలోల బియ్యంతో పాటు 28 వేల రూపాయల నగదును అందించి మనోధైర్యాన్ని నింపి చంద్రమౌళికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు మిట్టపల్లి రాజకుమార్, రాంబాబు, శివకుమార్, శోభన్, సంపత్, మహేందర్ రెడ్డి, పున్నం చందర్, కుమారస్వామి, సుధాకర్, లింగయ్య, లక్ష్మణ్, సతీష్, రమేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement