Saturday, November 23, 2024

మేడారం జాత‌ర ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న : క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య

మేడారం జాతర పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ జనవరి నెలాఖరు వరకు పూర్తి చేసే విధంగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలన చేయడం జరుగుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ … మేడారం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడంలో ములుగు జిల్లా ఆరో స్థానంలో ఉంద‌న్నారు. జిల్లాలోవ్యాక్సినేషన్ ను ముమ్మరంగా కొనసాగుతుందని, మొదటి డోసు వాక్సినేషన్ 100శాతం పూర్తి చేశామన్నారు. పాత్రికేయులంద‌రూ మేడారానికి సంబంధించిన ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఇందులో భాగంగా స్వయంగా జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి బూస్టర్ డోస్ వాక్సినేషన్ పాత్రికేయులకు అందించే విధంగా చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement