మహబూబాబాద్ : గ్రామంలో ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలను మెరుగుపరిచి వాడకంలోకి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక గంగారం మండల కేంద్రంలో పర్యటించి సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం లను సందర్శించి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ముందుగా సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలిస్తూ, షెడ్ వరకు ట్రాక్టర్ వచ్చే విధంగా దారిని సరిచెసి చదును చేయాలని, నీటి సౌకర్యం కొరకు ట్యాంక్ ను వెంటనే ఏర్పాటు చేయాలని, వాడుతున్నట్లు కనబడుట లేదని, వాడకంలోకి తీసుకొచ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి ఆదాయం సంపందించాలని, తడి చెత్తతో ఎరువులను తయారు చేయాలని, పొడి చెత్త సేకరణ చేసిన వాటిని 15 రోజులకొకసారి అమ్మాలని, సోలార్ లైట్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వైకుంటధామం పరిశీలిస్తూ ప్రజలు సౌకర్యార్థం నడక మార్గం సరి చేసి ఏర్పాటు చేయాలని, వాష్ రూం, టాయ్లెట్, షవర్స్ పని చేసే విధంగా నీటి వసతి కల్పించాలని, సిమెంట్ రింగ్స్ తో సంప్ ఏర్పాటు చేసి అక్కడి నుండి వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్ కు నీరు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సౌకర్యాలు మెరుగు పరిచి రెండిటినీ వాడకంలోకి తీసుకొని రావాలని సూచించారు. అనంతరం గ్రామంలో చెత్త సేకరణ, మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతున్న వాటిపై సర్పంచ్, సంభందిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సారమ్మ, ఎంపిఓ సత్యనారాయణ, ఎంపీడీవో పులి వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సూర్యనారాయణ, పీఆర్ ఏ ఈ యశ్వంత్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement