వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో పట్టపగలే మట్టి దోపిడీ బజాప్తగా జరుగుతుంది. మాదన్నపేట చిన్న చెరువులో నిన్నటి నుండి మొరం దందా నడుస్తుంది అని స్థానికులు తెలుపుతున్నారు. సమాచారం తెలిసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు లూటి అవుతున్నాయి. రైతులు మొరం పొలాల్లో పోసుకుంటున్నట్లు, ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసే చేస్తున్నాం అని మొరం తరలింపు దారులు గంభీర్యాన్ని వ్యక్తం చేస్తుంటే.. మాకేమి తెలియదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కొందరు మొరం తరలింపు దారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుండి మొరం తరలింపు చేస్తూ చెరువులు లూటీ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం ఒకింత అనుమానాలకు తావిస్తున్నది. కంచె చేను మేస్తే కాదనేవారు ఎవరుంటారు అని ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ మొరం తరలింపును ఆపుతారో లేదో వేచి చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement