రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో పారిశుధ్యం, పచ్చదనంతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. హాసన్ పర్తి మండలం బైరాన్ పల్లి, HCN తండా, అర్వపల్లి గ్రామాలలో సుమారు కోటి 36 లక్షలతో చేపట్టిన వైకుంఠ దమాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, పబ్లిక్ టాయిలెట్స్, అంతర్గత సిసి రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. దీనిలో భాగంగా ప్రతీ నెల గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో ఘననీయమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పూర్తి చేయాలని అన్నారు. అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షురాలు ఎల్లవుల లలిత యాదవ్, ఎంపీపీ కేతాపాక సునిత, జెడ్పీటీసీ రెనుకుంట్ల సునిత, వైస్ ఎంపీపీ రత్నాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమేష్ గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అంచూరి విజయ్, మండల పార్టీ అధ్యక్షుడు బండి రజినీ కుమార్,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీసీటీ ఫోరం అధ్యక్షులు హరికాంత్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.