Friday, September 20, 2024

WGL: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆదర్శంగా నిలవాలి… ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : ప్రతి ఇంటిలో కచ్చితంగా మొక్కలు నాటి చిన్నపిల్లల మాదిరి చెట్లను కాపాడితే అవి తిరిగి మనల్ని కాపాడతాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19 వార్డుల ప్రధాన కూడలిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… వానాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంచి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిరంతరం జరగాలి.. కలెక్టర్
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిరంతరం జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజల సహకారంతో జిల్లాలో విజయవంతంగా అమలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఐదు రోజులే కాకుండా నిరంతరం జరగాలని సూచించారు. ప్రజలు ఇండ్ల పరిసరాలు, గ్రామాలు, మున్సిపాలిటీలో ప్రతి ఇంటిలో మొక్కలు నాటి సంరక్షిస్తే పచ్చదనం ఏర్పడి మంచి వాతావరణం నెలకొంటుందని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement