జనగామ : ప్రజల్లో ఆరోగ్య సేవల పై అవగాహన పెంచేందుకే మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను వినియోగించుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ట్రన్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 45 మంది డాక్టర్లు, 150 సిబ్బందితో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ప్రజలకు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు. అదేవిధంగా ప్రజలకు కల్పించిన వసతులను వైద్యాధికారులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… ఆజాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై నిరుపేదల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలానే ఉద్దేశ్యంతో ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాలోను, డివిజన్ లోను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనలు ఉన్నందున జిల్లా కేంద్రంలోని ప్రెస్ట్రన్ కళాశాలలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు..రోగ తీవ్రతను బట్టి రోగులకు సలహాలు, సూచనలను వైద్య నిపుణులు అందజేస్తూ సంబంధించిన వారిని హాస్పిటల్ కు తరలించేందుకు అంబులెన్స్, 108 వాహనాలు ఏర్పాటు చేశామని, గర్భిణీ స్త్రీలు 102 వాహనాలు, చిన్నారులకు ఆర్.బి.ఎస్.కె. వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.. అలాగే ఈ నెల 21వ తేదీన స్టేషన్ ఘన్పూర్ డివిజన్ లోని విద్యాజ్యోతి కళాశాలలో ఏర్పాటు చేస్తున్నందున ఆయా ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా వైద్య సేవలు పొందాలన్నారు..ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య అధికారి మహేందర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు సుగుణాకర్ రాజు, ప్రభుత్వ డాక్టర్ లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement