భూపాలపల్లి, ప్రభన్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రాథమిక హాస్పిటల్ కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా గురువారం భూపాలపల్లి జిల్లా పరిధిలో బూస్టర్ డోస్ వాక్సిన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ బూస్టర్ డోస్ వేసుకొని అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి ఖచ్చితంగా బూస్టర్ డోస్ వేసుకోవాలని సిబ్బందికి సూచించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అజాగ్రత్త, నిర్లక్ష్యం వంటివి ప్రాణాంతకం అవుతాయన్న వాస్తవాన్ని గుర్తించి స్వీయ క్రమశిక్షణతో కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.
కోవిడ్ వలన గతంలో జరిగిన కష్టనష్టాలను గుర్తు చేసుకుని, మరోసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రజలంతా అప్రమత్తతతో ఉంటేనే విపత్తును ఎదుర్కొనగలమని ఎస్పీ పేర్కొన్నారు. మాస్క్, భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా,గుంపులుగా ఉండకుండా మన సమాజాన్ని కాపాడుకునేందుకు నడుచుకుందామని, చట్టవిరుద్దంగా ప్రవర్తించే వారిపై జాతీయ విపత్తు చట్టం ప్రకారం జరిమానాలు విధించాలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital