Tuesday, November 26, 2024

తెలంగాణ‌లో ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎదగాలి – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం గవిచర్ల గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అంద‌జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అర్హులైన వారికి ఆసరా పెన్షన్ లు అందచేస్తున్నామ‌న్నారు. 57 సంవత్సరాల వయస్సు గల కుంటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి కూడా ఆసరా కల్పించాలని పెన్షన్ అందచేస్తున్నామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎదగాలని కోరుకునే ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు.

పేదలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు వారి కుటుంబాలకు ఆసరా కల్పించాలని కేసీఆర్ కోరుకుంటే ఇలాంటి పథకాలను రద్దు చేయాలని బీజేపీ నాయకులు చెప్పుతున్నారు. గతంలో రైతులు కరెంట్ కష్టాలు తెలుసు కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 24 గంటల కరెంట్ తో రైతు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతుల బావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టమని చెపుతున్న బీజేపీ నాయకులను పల్లెల్లో రైతులు నిలదీయాలి. గవిచర్ల గ్రామాల్లో మహిళ కోసం మహిళ భవనం ను మంజూరు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి లో భాగంగా అనేక నిధులు మంజూరు చేసి, పల్లెలు అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. అనంతరం గవిచర్ల గ్రామంలో మహిళ భవనంకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు , స్థానిక ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు , టి.ఆర్.ఎస్.నాయకులు ,కార్యకర్తలు,అధికారులు , మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement