వరంగల్ అర్బన్ – దేశంలోనే అతి పెద్ద ఝాఠ పార్టీ బిజెపి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఫైర్ అయ్యారు…బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ ఎస్ పార్టీపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.. వరంగల్ లో ఆయన ఎమ్మెల్యే దానం విజయ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వరంగల్ వరదలలో చిక్కుకుంటే కేంద్రం ఏం సాయం చేసిందని బండిని నిలదీశారు…ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం విభజన చట్టంలోనే ఉందన్న విషయం కూడా బండికి తెలీయదని అంటూ వ్యాఖ్యానించారు… ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని బిజెపి ఎప్పుడు చెప్పలేదన్న బండి వ్యాఖ్యాలను ఎర్రబెల్లి ఖండిస్తూ, బిజెపి రెండు నాల్కల ధోరణికి ఇది నిదర్శనమన్నారు.. వరంగల్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 957 కోట్లు ఖర్చు చేశామని, అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినదనికంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీకి, గిరిజన యునివర్శిటీకి ఇప్పటికే టిఆర్ ఎస్ ప్రభుత్వం భూములను కేటాయిందన్న విషయం బండికి తెలుసా అంటూ ప్రశ్నించారు.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘ తెలంగాణలో తీవ్ర వరదలతో నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు కేంద్రం నుంచి ఏం సాయం అందింది..?. తెలంగాణాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఎన్ని తెచ్చావ్..?. విభజన చట్టం కింద వరంగల్ కోచ్ వ్యాగన్ ఇస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయే. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఒప్పుకున్న వాటాలను ఇస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలకు న్యాయమైన వాటాలను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు..?’ అని అటు కేంద్రంపై ఇటు బండిపై ఎర్రబెల్లి ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ లో మాయ మాటలు చెప్పి కొన్ని సీట్లు గెలిచిన బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ సీటులోనే ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, లీడర్ లు లేని పార్టీ కాంగ్రెస్ అని, క్యాడర్ లేని పార్టీ బిజెపి అని అన్నారు..ఇటువంటి పార్టీలు చేసే విమర్శలను తాము పట్టించుకోబోమని అన్నారు…వరంగల్ నగర అభివృద్ధికి బిజెపి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
బండికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ …
Advertisement
తాజా వార్తలు
Advertisement