వరంగల్ – మైనార్టీ కుటుంబాల సమగ్ర అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం హన్మకొండ స్నేహ నగర్ లోని యస్.వి.కన్వేన్షన్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటి సారిగా క్రిస్‌మస్ పండుగని అధికారిక కార్యక్రమంగా గుర్తించి వారికి ఉచిత స్థానం కల్పించే అధికారికంగా నిర్వహించిన ఘనత మన సియం కెసిఆర్ గారికి దక్కుతుందని తెలిపారు. నిరుపేద క్రిష్టియన్లకు క్రిస్మస్ సందర్భంగా బట్టలు పంపిణీ చేస్తూ వారికి నేనున్నానని భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, టిఆర్ఎస్ పార్టీకి, పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచి, ఆశీర్వదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసి, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా వెళుతోందన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు తీసేయడం వల్ల జరిగే అనర్ధాలకి బిజెపి ప్రభుత్వం తప్పక బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సియం కేసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖామంత్రి కె టి ఆర్ లు కరోనా నుండి పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ఫాదర్ ల తో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement