టిఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ది.
కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర.
గ్యాస్ సిలెండర్లతో బిజేపికి నిరసన తెలుపాలని పిలుపు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం.
ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మి, షాధిముభారక్ పథకాలు.
ఆసరా పెన్షన్లతో వృద్దుల గౌరవాన్ని పెంచిన మహానీయుడు మన కేసిఆర్.
ఆరు నెలల్లో టెక్స్టైల్ పార్క్ ప్రారంభం.. లేక పోతే తాను దేనికైనా సిద్దం.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తేగలరా అంటూ బిజేపికి ఎర్రబెల్లి సవాల్.
వరంగల్ నగరంలో జరిగిన అభివృద్దిని, టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ ధాస్యం వినయ్భాస్కర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సియం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని, కేసిఆర్ గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. చారిత్రక చరిత్ర కలిగిన వరంగల్ నగరం గత ఆంద్రా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిపోయిందని, సియం కేసిఆర్ అండతో పూర్వవైభవం తీసుకోస్తూ.. అభివృద్ది చేసుకుంటున్నామని అందుకు ప్రజలంతా కారు గుర్తుకు ఓట్లేసి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని అన్నారు.
బిజేపి పార్టీ జూటా పార్టీ.. అబద్దాల పార్టీ, మోసకారి పార్టీ కాంగ్రేస్ పార్టీలు రెండు ఒక్కటేనని.. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు రంగులు మార్చుకొని వస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి పార్టీ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలన్నారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా యువతను మోసం చేసిన బిజేపి, లక్షా ముప్పైవేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి, మరో 50వేల ఉద్యోగాలకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి కేసిఆర్ ను విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు.
వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఆరు నెలల్లో ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. లేకపోతే తాను దేనికైనా సిద్దమన్నారు. నాడు మనకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని తరలించి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే.. పోరాడి సాధించుకున్న తెలంగాణ హక్కులను కాలరాస్తున్న బిజేపికి తగిన బుధ్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిన స్థలంలో చెట్లు పెరిగిపోతున్నాయని.. ఎప్పుడు తెస్తారో చేప్పాలని సవాల్ విసిరారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి పేదల జన్‌ధన్ ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామన్న మోధీ మాటలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను చేతగాని వాడిగ మాట్లాడిన మోధీ, అమిత్‌షాలు నేడు సెంచరీకి చేరిన పెట్రోల్ ధరలు, వెయ్యికి చేరిన గ్యాస్ ధరలకు ఏం సమాధానం ఇస్తారోనంటూ ఎద్దేవచేశారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో జరుగని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా మన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు నిలిచారన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఐదు వందల రూపాయల పెన్షన్లు కూడా ఇవ్వలేనివారు.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కళ్యాణలక్ష్మి, షాధీముభారక్ పథకాలతో తెలంగాణ ఆడపడుచులకు మేనమామగా నిలిచి, ఆసరా పెన్షన్లతో వృద్దులకు గౌరవాన్ని పెంచిన మహానీయుడు మన ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇంటింటికీ స్వఛ్చమైన త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలోనె తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. బిజేపి మాయ మాటల పార్టీ , ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపిస్తుంది, ఉన్న ఉద్యోగాలు ఊడగోట్టేందుకు రైల్వే, బియస్యన్ఎల్, ఏయిర్ పోర్ట్‌లు లాంటి కేంద్ర సంస్థలను ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లు ఎత్తేసి పేద వర్గాలకు అన్యాయం చేస్తుందన్నారు. కరోనా సమయంలోనూ ప్రజల సంక్షేమాన్ని మరిచి, తెలంగాణపై వివక్ష చూపిస్తుందన్నారు.
నాడు వరదలు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా సహాయం చేయలేని కేంద్రంలోని బిజేపి ప్రభత్వం. ఏ మొఖం పెట్టుకుని వస్తుందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడని బిజేపి దద్దమ్మలు ఓట్ల కోసం ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాను బిజేపి పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని అన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాలకు ఓ న్యాయం.. మన తెలంగాణ రాష్ట్రానికి ఓ న్యాయమా అంటూ.. ఓట్ల కోసం వచ్చే బిజేపి వాళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. మన ప్రాంతం, మన నగరం అభివృద్దిపై మనకున్న ఆరాటం, ఆలోచన డిల్లి నాయకత్వానికి ఉంటుందా.. ఆలోచించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నిలిపి ఆదర్శంగా నిలబెట్టాలన్న ప్రధాన ఎజెండాతో మన నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేటిఆర్ లకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.