భూపాలపల్లి మున్సిపాలిటిలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక కానుంది. ఈ ఎన్నిక నేపథ్యంలో తనను అరెస్టు చేసేందుకు సిద్దపడ్డారంటూ 12వ వార్డు కౌన్సిలర్ కొత్త హరిబాబు వీడియో సందేశంలో ఆరోపించారు.
కాగా, గత కొద్ది నెలల ముందు భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబును చేయడంతో ఆమోదం పొందింది. ఆయన ఇంటి వద్ద మంగళవారం అర్థరాత్రి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. ఓ కేసులో అరెస్టుకు సిద్ధపడ్డట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది.