Tuesday, November 19, 2024

కంటి చూపు సమస్యలపై నిర్లక్ష్యం చేయద్దు… ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల : గ్రామాల్లోని ప్రజలు కంటి చూపు బారిన పడి నిర్లక్ష్యం చేయకుండా కంటి వెలుగు శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని చింతకుంటారామయ్య పల్లిలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు, మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహార పదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి ముకిరాల మధువంశీకృష్ణ, జెడ్పిటిసి గొర్రె సాగర్, ఎంపీపీ దావు వినోద, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, మండల అధ్యక్షులు ఆ ఆరేపెల్లి మల్లయ్య , మండల నాయకులు మడికొండ రవీందర్రావు, మండలప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement