Friday, November 22, 2024

రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు : మంత్రి ఎర్రబెల్లి

స్టేషన్ ఘన్ పూర్ : రక్తదానం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో 75వ స్వతంత్ర వజ్రోత్సవాల సంధర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిధిగా మంత్రి ఎర్రబెల్లి హాజరైయ్యారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోనే ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టి రాష్ట్రం సాధించుకున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. అనంతరం స్టేషన్ ఘన్ పూర్ తహసీల్దార్ కు మంత్రి ఎర్రబెల్లి ధ్రువపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డివో రాంరెడ్డి, డీఎంహెచ్ఓ మహేందర్, సూపర్డెంట్ సుగుణాకర్ రాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్, ఎంపీపీ కందుల రేఖ, జడ్పీటీసీ మారపక రవి, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్, సీఐ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ శ్రీవాణి, ఎస్ఐ శ్రవణ్, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement