వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హస్తం లావణ్య భూజంగం దంపతులకు చెందిన రెండు సంవత్సరాల పాపను కుక్క కరిచింది. ఈ ఘటనలో కుక్క పాప చెవిని పట్టుకుని లాగడంతో చెవిలో సఘభాగం తెగిపోయింది. దీంతో పాప పడిన బాధను చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. పాపను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాప బంధువులు విషయాన్ని మండల అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని బయటకు (విలేకరులకు) పొక్కకుండా చూడాలని ఓ అధికారి అనటం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement