Wednesday, November 20, 2024

ప్రజా సమస్యలు పట్టవా? : బీజేపీ నేత వెంకట్ గౌడ్

బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా వరంగల్ దేశాయిపేటలోని డివిజన్ 12 బొడ్రాయి ప్రాంతంలో బీజేపీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తాబేటి వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో శక్తికేంద్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. డివిజన్ లోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దేశాయిపేట ప్రాంతంలో రహదారులు చాలా అధ్వానంగా తయారయ్యాయ‌ని, ఏండ్లు గడుస్తున్నా ఇంత వరకు పోచమ్మమైదాన్ – సికెయం కాలేజీ వరకు రహదారి పనులు పూర్తి చేయ‌కుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఈ ప్రాంతం నిత్యం దుమ్ము, దూళితో పేరుకుపోయి ప్రజలకు సమస్యగా మారింది. మంచినీటి సమస్యతో ఈ ప్రాంత ప్రజలు పడుతున్నా ఇబ్బందులు, నాలాల్లో చెత్తచెదారం, వ్యర్ధ పదార్ధాలతో నిండి దుర్వాసన వస్తున్న చర్యలు తీసుకోకుండ GHMC నిర్లక్ష్యం వ‌హిస్తుంది. ఇన్ని సమస్యలు కుప్పల పేరుకుపోయిన కూడా స్థానిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు అన్నారు.

వరంగల్ అభివృద్ధిని పట్టించుకోకుండా, కేసీఆర్, కేటీఆర్ మన్ననల కోసం లక్షలు ఖర్చుపెట్టి పుట్టిన రోజు వేడుకలు చేసి సమయం, డబ్బు ఎమ్మెల్యేలు వృథా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులేనని, నగరంలో ఎల్ఈడి లైట్స్, రహదారులు లాంటి అనేక అభివృద్ధి పనులు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. కరోనా విపత్తు సమయం నుండి నేటి వరకు పేదలు ఎవరు ఆకలితో ఉండొద్దని మూడేళ్లుగా పేదలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోలా ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తున్న ఘనత నరేంద‌ర మోదీ ప్రభుత్వానిది అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో ఒక్కో వ్యక్తికి రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్ మెంట్ అందిస్తూ ఆయుష్మాన్ భారత్ పథకం కేంద్ర ప్రభుత్వ చలవే అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు ఆకారపు మోహన్, డివిజన్ అధ్యక్షులు క్యాతం రాజు, బిజెపి కార్యకర్తలు, పెద్దసంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement