కొత్తగూడ, (ప్రభ న్యూస్): క్రిషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎంపియుపిఎస్ వేలుబెల్లి పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేశారు. క్రిషి స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పొనుగోటి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతికత పెరుగుతున్న తరుణంలో.. ప్రతి ఒక్కరూ ఫోన్లతోనే కాలం గడుపుతున్నారని, ఇటువంటి పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, విద్యార్థులల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలనే ఆలోచనతో.. పుస్తకాలను పంపిణి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులకు ధీటుగా చదివి ఫలితాలు సాధించాలని అన్నారు. కార్యక్రమం అనంతరం అమెరికాలో స్థిరపడిన మయూరి సతీష్, వారి పిల్లలు సిరి, వేదాస్ లు విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలు, సైన్స్ చార్టులు, నోట్ బుక్స్,పాడ్స్,స్కూల్ బాగ్స్, కంపాస్ బాక్స్, లైబ్రరీ పుస్తకాలు భద్రపరచుకోవడానికి బీరువా ను బహుకరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దివ్య, నర్సింహారావు, అంజలి, ఎంపిటిసి సంతోషరాణి, ఎస్ఎంసి చైర్మన్ రాజు,ఉప సర్పంచ్ ఉళ్లేంగుల సురేష్, ఉపాధ్యాయులు రాంచందర్ కృష్ణమూర్తి, నారాయణ, నాగరాజు, జయసుధ, ప్రమీల గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement