పల్లెల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని, గతంకంటే ప్రస్తుతం పల్లెల రూపురేఖలు మారాయని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. గురువారం ఆమె జనగామ జిల్లాలోని నేలపోగుల గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, క్రీడా ప్రాంగణం వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లోకి ఎండాకాలంలో అధికారులు వెళ్లాలంటే జంకేవారు.
తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందిస్తూ నేలపోగుల గ్రామం అభివృద్ధిలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో పీడీ రామ్ రెడ్డి, సర్పంచ్ దూసరి గణపతి, తదితరులు పాల్గొన్నారు.