Friday, November 22, 2024

వరంగల్ పోలీస్ అధ్వర్యంలో సైక్లోథాన్ వరంగల్-2022

వ‌రంగ‌ల్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ పోలిసుల అధ్వర్యంలో ఈ నెల 26వ తేదిన సైక్లోథాన్ వరంగల్ 2022 పేరుతో సైక్లింగ్ పోటీలను నిర్వహించబడుతోందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ ఈ సైక్లోథాన్ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగంతో అక్రమ రవాణా పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆలోచనలకై సైక్లింగ్ వ్యాయామం ఏవిధంగా దోహదపడుతుందో యువతను అలోచింపజేసే రీతిలో సైక్లోథాన్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి ప్రారంభమయ్యే ఈ సైక్లోథాన్ పోటీలు 25 కిలో మీటర్ల పుల్ రేస్, 15 కిలో మీటర్ల ఫన్ రేస్, 5 కిలో మీటర్ల కిడ్స్ రేస్ కు సంబందించి మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించబడుతుంది. ఈ పోటీలకు అంతర్జాతీయ సైక్లిస్ట్ రాహుల్ మిశ్రాతో పాటు ప్రముఖులు హజరవుతున్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన సైక్లిస్ట్ లకు నగదు పురస్కారలు అందజేయబడుతాయని. ఈ పోటీల్లో పాల్గోనే ఔత్సాహికులు ముందుగా 8142111145 నంబర్ కు గూగుల్ పే ద్వరా 199 రూపాయల రుసుము చెల్లించి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయుంచుకోవాల్సి వుంటుందని. ఈ పోటీలకు అన్ని వయస్సుల వారు ఉత్సహం పాల్గోని..మాదకద్రవ్యాల నియంత్రణకై పోలీసులు సాగిస్తున్న పోరాటంకు ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement