టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు ఒకే సారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పింది అని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాలను మాఫీ చేయాలి అని అదే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలి అని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేసారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని పంట రుణాలను మాఫీ చేయాలని, పీఎం ఫసల్ భీమా యోజన అమలుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు పుల్యాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని రైతు బజార్ వద్ద రైతుల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు హాజరై రైతుల దగ్గర నుండి సంతకాలను సేకరించారు. ఈ సందర్బంగా రావు పద్మ మాట్లాడుతు టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు ఒకే సారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పింది అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణం వడ్డీతో సహా మాఫీ చేయాలని డిమాండ్ చేసారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టపోతే నష్టపరిహారం కోసం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తన వాటా చెల్లించకుండా అది రాష్ట్రంలో అమలు చేయడం లేదని, దాని వలన రాష్ట్ర రైతులు ఎంతో నష్టపోతున్నారు అని, కావున తెలంగాణ ప్రభుత్వ ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలి అని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం అని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం అని, అప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తామని తెలియజేసారు. అదే విధంగా భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే భేషరతుగా ఆర్థిక సహాయం చేయాలి అని డిమాండ్ చేసారు. ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం ఈనెల 16 నుంచి 24 వరకు ప్రతి గ్రామంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది అని తెలియజేసారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుజ్జులా వసంత, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, కార్యదర్శి గుజ్జుల మహేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్ది మహేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు గండు సారయ్య, గట్టు రాజమౌళి, 61వ డివిజన్ అధ్యక్షులు రాజి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.