మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరికి మద్దతిస్తామనే అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. భువనగిరిలో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 160 చెరువులు మూసీ ద్వారా నిండుతున్నాయని, ఐదు కాలువల ద్వారా నది పారుతున్నదని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతం విషతుల్యమయిందని తెలిపారు. కాగా, మునుగోడులో కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. శనివారం మునుగోడులో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభలో ఆ పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌తో వేదిక పంచుకున్న విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement