వరంగల్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాలిగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఆయన వరంగల్ లో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ చేసే టి ఎస్ పీఎస్ లో ఒక్కరినీ మాత్రమే నియమించారు.మిగతా పోస్టుల నియమాకాలను గాలికి వదిలేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమయిందన్నారు.ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించటం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రకటన వెలువదక పోవటంతో మనస్తాపం చెందిన బోడా సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రభుత్వ విధానాల వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.తెలంగాణ లో పంటలకు నీరందక ఎండీ పోతున్నాయి.. రైతులు రోడ్డున పడుతున్నారు.దేవాదుల ప్రాజెక్టు లల్లో వందల కోట్లు ఖర్చు చేశారు.అయిన రైతుల పంటలకు నీరందటం లేదు.పైపులైన్ లల్లో నాణ్యత లోపాల కారణంగా మెట్ట ప్రాంతాల్లో ని పంటల కు నీరు అందించాలి.ఎండి పోతున్న పంటలకు నీరు విడుదల చేయక పోతే… దేవాదుల ప్రాజెక్టు కారీలయం వద్ద ఆందోళన చేస్తాం అన్నారు.
ప్రవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల ఉపాధి లేక కూలీలకు వెళుతున్నారు. ఆలోచించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తోంది.