భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అవినీతి ఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. పాల్వంచ టౌన్ ఎస్ ఐ బాణాల రాము ఓ కేసులో నిందితుడికి సాయం చేసేందుకు ఓ న్యాయవాది నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఎస్ఐ రాములు 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ వలలో పరకాల సబ్ రిజిస్ట్రార్…
వరంగల్ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కందాల సునీత… ఇద్దరు అన్నదమ్ముల సేల్ & గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.80 వేలు లంచం డిమాండ్ చేసింది. అయితే, వారు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సునీత లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.