Sunday, November 3, 2024

క‌రోనా, ఒమిక్రాన్ ఎఫెక్ట్ : ఆందోళ‌న‌లో ప్రైవేట్ పంతుళ్లు

ములుగు : కరోనా కాటుకు ప్రైవేటు ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. కరోనా మొదటి దశ కారణంగా.. దాదాపు ఆరు నెలల పాటు పాఠశాలలు మూత పడ్డాయి. దీంతో అప్పట్లో వేతనాలు రాక, బతుకు భారమై పలువురు ఉపాధ్యాయులు.. ఇతరత్రా పనులు చేసి పొట్టనింపుకున్నారు. కానీ తర్వాత కరోనా తగ్గి పాఠశాలలు తెరిచారనీ సంబరపడితే, అది కాస్త మున్నాళ్ల‌ ముచ్చటగా మిగిలిపోయి, కరోనా రెండో దశ విలయతాండవం చేసింది. దీంతో పాఠశాలలు మూతపడి, జీతాలు ఆగిపోయి, ఇంతకుముందు చేపట్టిన పనులు సైతం నిలిచిపోయాయి. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పి, విద్యార్థుల‌ భవిష్యత్తును మార్చే ఉపాధ్యాయుల భవిష్యత్తు క‌రోనాతో అంధకారంలో మునిగిపోయిందనీ ఆవేదన చెందుతున్నారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా, ఒమిక్రాన్ తో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ప్రైవేట్ పంతుళ్ల‌లో గుబులురేకెత్తిస్తుంది.

పాఠశాలలు, కళాశాలలు నడిచినప్పుడే అరకొర జీతాలతో జీవనం సాగించేవారనీ, ఇప్పుడు మళ్ళీ పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. కరోనా మొదటి దశలో కొంతమంది ఉపాధ్యాయులు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మరి కొంతమంది లక్షల రూపాయలు పోసి ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం మళ్ళీ కళాశాలలు, పాఠశాలలు మూతపడడంతో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు వేతనాలు రాక.. బతికేందుకు అవకాశం లేక.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామ‌న్నారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు అవ‌కాశాన్ని తాకుతుండడంతో పూట గడవడం కష్టంగా మారుతుందని పలువురు ప్రైవేట్‌ ఉపాధ్యాయులు వాపోతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తోండడంతో ప్రభుత్వం ఈనెల 17 నుండి 31 వరకు సెలవులను ప్రకటించింది. దీంతో ఈ నెల 31తో సెలవులు ముగిసినట్లేనా లేక మళ్ళీ పొడిగిస్తారా అనే అనుమానాలను పలువురు పంతుళ్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement