నర్సంపేట, ఆగస్టు 5 (ప్రభ న్యూస్): గ్రామాన్ని దిగ్బంధనం చేసి పోలీస్ అధికారులు గ్రామంలోకి వచ్చి నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను సాధీనంలోకి తీసుకున్న సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటిక్యాలపల్లిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నర్సంపేట మండలం ఇటిక్యాలపల్లి గ్రామంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన కార్డెన్ సెర్చ్ లో రికార్డు స్థాయిలో వాహనాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.
వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝూ, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆదేశాల మేరకు ఇటకాలపల్లి లో కార్డెన్ సెర్చ్ లో 40, ద్విచక్ర వాహనాలను,10 ఆటోలు, 10 లీటర్ల నాటు సారా, 40 అంబర్ ప్యాకెట్ సీజ్ చేయడం జరిగిందని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు.
గ్రామస్తులను సమావేశ పరిచి వారికి సైబర్ క్రైమ్, నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి, ట్రాఫికింగ్, డయల్ 100 గురించి, 1930 సైబర్ క్రైమ్ గురించి, కొత్త చట్టాల పైన ఏసీపీ కిరణ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నర్సంపేట సిఐ దక్షిణామూర్తి, దుగ్గొండి, నెక్కొండ సిఐలు చంద్రమోహన్ రాజగోపాల్, ఎక్సైజ్ శాఖ సీఐ నరేష్ రెడ్డి, నల్లబెల్లి, ఖానాపురం, నెక్కొండ ఎస్ఐ పోలీస్ సిబ్బంది,నర్సంపేట సబ్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు.