Thursday, November 21, 2024

నేరాల నియంత్రణకై కార్డన్ సర్చ్: వరంగల్ ఏసిపి

నేరాలను నియంత్రణతో పాటు శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తారని వరంగల్  డివిజినల్ పోలీస్ అధికారి తెలిపారు. వరంగల్ డివిజినల్ పోలీసుల అధ్వర్యంలో  శనివారం రాత్రి ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సర్చ్ చెపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు లక్ష్మీ పురంలోని రెండు వందలకు పైగా ఇండ్లతో పాటు వివిధ షాపులను తనీఖీ చేసారు. ఈ తనీఖీల్లో పోలీసులు సుమారు నాలుగు వేల రూపాయల విలువైన మద్యం సీసాలతో పాటు, ఎలాంటి పత్రాలు లేని ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లక్ష్మీ పురం ప్రాంతవాసులతో వరంగల్ ఏసిపి ముచ్చటస్తూ మత్తు పదార్థాల వినియోగంతో పాటు వాటి విక్రయించడం లాంటి చర్యలకు పాల్పడితే జరిగే అనార్థాలతో పాటు పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, సిసి కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా కలిగే లాభాలను ఏసిపి వివరించారు. ఏవరైన అనుమానిత వ్యక్తులను గుర్తించిన, చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement