Home తెలంగాణ‌ Wgl | అంతా మా ఇష్టం.. నగరంలో ఇష్టారీతిన భవన నిర్మాణాలు

Wgl | అంతా మా ఇష్టం.. నగరంలో ఇష్టారీతిన భవన నిర్మాణాలు

0
Wgl | అంతా మా ఇష్టం.. నగరంలో ఇష్టారీతిన భవన నిర్మాణాలు

వరంగల్ సిటీ బ్యూరో, ఆంద్రప్రభ : హన్మకొండ పట్టణంలో భవన నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అధికారులు హెచ్చరిస్తున్నా కనీస నిబంధనలు పాటించకుండా ‘‘అంతా మా ఇష్టం’’ అన్నట్లుగా ముకుందా జ్యూవెల్లరీ షాపు యజమానులు వ్యవహరిస్తున్నారు. సెట్‌బ్యాక్‌ వదలకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.

కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి వచ్చినా పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయి. హన్మకొండ నగరం నడిబొడ్డున అక్రమంగా యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మించడమే కాదూ… అందులో రేపు ముకుందా జ్యూలరీ షాపు ఓపెనింగ్ కి భారీ ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.

ఆ భవనం నిబంధనలకు విరుద్ధంగా ఉంది.. అని బల్దియా అధికారులు గత రెండు రోజుల క్రితం నోటీసులు సైతం ఇచ్చారు. కానీ అవేవి మాకు పట్టవు..మీ నోటీసులకు భయపడేదే లేదు అన్నట్లుగా రేపు షాపు ఓపెనింగ్ ఏర్పాట్లు చేసినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న షాపుకి కనీసం వాహనాలు నిలిపేందుకు స్థలం కూడా ఉండడం లేదు. నాలుగు కార్లు నిలిపితే..మరో కారు రోడ్డుపైనే పెట్టాల్సిన దుస్థితి ఉంది. ఇలాగే కొనసాగితే భవిషత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా వంద గజాలు దాటితే పది ఫీట్ల వరకు సెట్‌బ్యాక్‌ను వదిలివేయాలి.

చుట్టూ 5 ఫీట్ల వరకు వదిలి భవన నిర్మాణాలు చేపట్టాలి. వాణిజ్యపరంగానే కాకుండా ఈ రోడ్డే ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. భవన నిర్మాణం చేసిన వారు సెల్లార్‌తో పాటు సెట్‌బ్యాక్‌లను వదిలేయకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అవసరాలరీత్యా వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా అనుమతులు ఇచ్చినా ఆ తర్వాత తనిఖీలు చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ముకుందా జ్యూలరీ ఏర్పాటు చేస్తున్నా బిల్డింగ్ కి కనీసం నోఅబ్జన్ సర్టిఫికేట్ లేకుండానే షాపు ప్రారంభిస్తున్నా..అధికారులు చూసిచూడనట్లు వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కనీసం ఫైర్ సెప్టీ సైతం లేకపోవడం గమనార్హం.

ముకుందా జ్యూలరీ ఏర్పాటు చేస్తున్న బిల్డింగ్ కి నోటీసులు ఇచ్చాం : ఇంచార్జీ సీటీ ప్లానర్ రవీందర్

ముకుందా జ్యూలరీ ఏర్పాటు చేస్తున్న బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేదు. అదనంగా నిర్మించి ప్లోర్ కి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అంతేకాకుండా షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవడానికి నోఅబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ అవేవి లేకుండా ముకుందా జ్యూలరీ షాపు ఏర్పాటు చేస్తున్నట్లు మా ద్రుష్టికి వచ్చింది. వారికి నోటీసులు ఇచ్చి వారంలో సమాధానం చెప్పాలని టైం ఇచ్చాం. ఈ లోపు అన్ని అనుమతులు లభించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.

Exit mobile version