ఖిలా వరంగల్, అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ ) : పని భారం తగ్గించాలంటూ కానిస్టేబుల్స్ ధర్నా చేస్తున్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూర్ 4ఫోర్త్ బెటాలియన్ కానిస్టేబుల్స్ ఏక్ పోలీస్ కావాలంటూ ప్రధాన గేటు వద్దకు చేరుకొని నినాదాలు చేస్తున్నారు కానిస్టేబుల్స్.
8 గంటలకు మించి పనిచేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి పోలీసు ఉద్యోగస్తులకు పనిభారం తగ్గించి ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.