Tuesday, November 26, 2024

రైతును రాజును చెయ్యడమే కాంగ్రెస్ లక్ష్యం : ఎమ్మెల్యే సీత‌క్క

రైతును రాజ‌ను చెయ్య‌డ‌మే కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే సీత‌క్క అన్నారు. ములుగు మండలంలోని పత్తి పెల్లి, చింత కుంట, చింతల పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో ఈ రోజు రైతు డిక్లరేషన్ రచ్చ బండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ.
ఇందిరమ్మ రైతు భరోసా- రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు, ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటామ‌న్నారు. ధరలు ముందే నిర్ణయించి, మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామ‌న్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామ‌న్నారు. మెరుగైన పంటల భీమాను తీసుకోస్తామ‌న్నారు. రైతు కూలీలకు, భూమిలేని రైతులకు భీమా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామ‌న్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు ధరణి పోర్టుల‌ను రద్దు చేస్తామ‌ని, మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తామ‌న్నారు. నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు.. అమ్మే సంస్థలపై పీడీ యాక్టు, పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామ‌న్నారు. చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామ‌న్నారు. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట పర అధికారాలతో రైతు కమీషన్, వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలని, అసమర్థ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల పాలనకు చరమ గీతం పాడాలని సీతక్క రైతులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, సహకార
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నునెటి శ్యామ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షులు దారవత్ సారయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, ఆర్ష మ్ రఘు, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి నగవత్ ప్రతాప్, మాజీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భద్రయ్య, లింగయ్య, భీమా నాయక్, మహేందర్, రాజన్న గోపి సింగ్, రాజు కుమార్,
గుంటి కిరణ్, బండి రమేష్, గంటి రవీందర్, సతీష్, ఎల్లయ్య, సురేష్, రాజీ రెడ్డి, రక్షిత్, వీరన్న, రవీందర్, పల్లె రజిత, సమ్మక్క పద్మ, సరోజన, బాలాజీ, చంద్
భీం రావ్, ప్రవీణ్ కుమార్, చంద్రయ్య, చంద్ర నారాయణ బ్రహ్మ చారి, రాజన్న, వెంకట స్వామి, పరమేష్, సతీష్, మల్లయ్య, కిరణ్, బద్రు, మోహన్
లాలమ్మ, నారాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement