Friday, November 22, 2024

వలస కూలీల అరెస్టులను ఖండించండి : మావోయిస్టు నేత వెంకటేష్

వాజేడు మార్చి 13 (ప్రభ న్యూస్) : మిరప కూలీకి వచ్చిన ఆదివాసులను చతిస్గ‌డ్ తెలంగాణ పోలీసులు కలిసి అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టడాన్ని ప్రజా స్వామ్యవాదులు మేధావులు పౌర హక్కుల సంఘాలు రైతులంతా ఖండించాలని మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి మహబూబాద్ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరున సోషల్ మీడియా వేదికగా లేక విడుదల చేశారు. చతిస్గడ్ రాష్ట్రం నుండి ఆదివాసి వలస కూలీలు ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు కన్నాయిగూడెం ఏటూరు నాగారం మంగపేట మండలాలలోకి మిరపకాయలు కోయడానికి రైతులు స్వయంగా చతిస్గడ్ రాష్ట్రం వెళ్లి తీసుకువస్తున్నారు. రైతులు చేనుల దగ్గర వారికి చిన్న గుడిసెలు ఏర్పాటు చేసి కూలీలతో మిరపకాయలు కోయిస్తున్నారు. వలస వచ్చిన గిరిజన కూలీల వద్దకు చతిస్గడ్ తెలంగాణ పోలీసులు వెళ్లి వారిని మీరంతా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని మలేషియా సంఘంలో పని చేస్తున్నారని విధ్వాంసకర చర్యలలో పాల్గొంటున్నారని చిత్రహింసలు పెడుతూ అరెస్టు చేసి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసు కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తూ కొంతమందికి డబ్బులు ఆశ చూపి పోలీస్ ఇన్ ఫార్మర్లుగా మారాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రజా ద్రోహులుగా మారమని చెప్పిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి చతిస్గడ్ రాష్ట్రానికి వచ్చి ఆదివాసి ప్రజలను రైతులు మిరప కూలికి తీసుకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వలస వెళ్లిన ఆదివాసి కూలీలను పోలీసులు పట్టుకుంటే వారి గురించి పట్టించుకోవడం లేదు వారి తరపున ఒక మాట కూడా మాట్లాడడం లేదు వారి పట్ల కనీస బాధ్యత కూడా వహించడం లేదు కాబట్టి రైతులంతా కలిసి కూలికి తీసుకొని వస్తే మీరు ఎందుకు పట్టుకు పోతున్నారని పోలీసులను ప్రభుత్వాన్ని నిలదీసి మిరపకాయ కూలికి తీసుకపోయినా ప్రజల కోసం రైతులు బాధ్యత వహించాలి చతిస్గడ్ తెలంగాణ పోలీసులు కలిసి మిరప కూలికి వచ్చిన ఆదివాసి ప్రజలను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టడాన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులు పౌర హక్కుల సంఘాలు రైతులంతా ఖండించాలని పిలుపునిచ్చిస్తు లేక లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement