Monday, November 18, 2024

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం : ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి

నర్సంపేట : మార్చి 20 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు “పోషణ పక్షం” సంవత్సరం-2023″ సందర్భంగా ICDS నర్సంపేట సెక్టార్ పరిధిలోని అంగన్ వాడి కేంద్రాలలో చురుకుగా ఉన్న పిల్లలకు నర్సంపేట శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు & బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు, వారి జీవనశైలి మళ్లీ మొదలవుతుందని అన్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణాలను ఆరోగ్య సంస్థ వారు సేకరించిన మీదట మనం తీసుకునే ఆహారమే మూలమని, దానిలో చిరుధాన్యాలు చాలా ముఖ్యమని వారి అధ్యాయంలో తేలిందన్నారు. దానిలో భాగంగానే 2023 సంవత్సరాన్ని WHO చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాల వాడకం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఆడపిల్ల ప్రసవం అంటే ఎంతో భయపడే పరిస్థితులు ఆనాడు ఉండేవి.. కానీ ఇప్పుడు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా అంగన్వాడీ టీచర్లు కృషి మరువలేనిది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లీ-బిడ్డల సంక్షేమానికి అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆడపిల్లలకు పెళ్లి దగ్గర నుండి పిల్లల్ని కనడం, వారిని పెంచడం వరకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. దేశం మొత్తంలో ధనికులు, ప్రభుత్వ అధికారుల మొదలుకొని పేదవారికి వరకు అత్యధికమైన ప్రసవాలు నేడు ప్రభుత్వ దవాఖానలో జరుగుతుండటం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ పోషణ పక్షం సంవత్సరం సందర్భంగా తల్లులందరికి నా శుభాకాంక్షలు అన్నారు. బహుమతులకు సహకరించిన మాజీ కౌన్సిలర్ బండి ప్రవీణ్ – కవిత దంపతులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని (DWO ) V.శారద, నర్సంపేట సిడిపిఓ రాధిక, ACDPO లు విద్య, హేమలత సూపర్వైజర్ P. ఝాన్సీ, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, గ్రంథాలయ డైరెక్టర్, కౌన్సిలర్ రాయుడి కీర్తి-దుష్యంత్ రెడ్డి, అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొర్రె రాధ, బత్తిని శిరీష, నర్సంపేట సెక్టార్ అంగన్వాడీ టీచర్లు, తల్లులు వారి పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement