Monday, July 1, 2024

WGL: రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ..

వాజేడు, జూన్ 29(ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం ములుగు జిల్లా వాజేడు సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం రైతు వేదికలో నిర్వహించారు. ఈ సమావేశానికి సహకార సంఘం అధ్యక్షులు ఎగ్గడి అంజయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్ మాట్లాడుతూ… రైతు భరోసా పథకంపై రైతులు తమ తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్త పరచాలని కోరారు.

ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను స్వయంగా తెలిపారు. రైతులు వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా కల్పించాలని కోరారు. రైతు అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం ఏవో వేణుగోపాల్, సహకార సంఘం ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాధరాజు, సహకార సంఘం సీఈఓ సత్యనారాయణ, సహకార సంఘం సిబ్బంది, ఏఈవోలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement