Friday, November 22, 2024

కలెక్టర్ కు రాఖీలు కట్టిన చిన్నారులు

జనగామ : నేను నీకు రక్ష..నాకు నువ్వు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రక్ష కట్టుకుంటూ.. అన్నదమ్ములు, అక్కాచెల్లెండ్లు, అన్ని పార్టీల మహిళా కార్యకర్తలు, రక్షాబంధన్‌ ప్రత్యేకతను చాటారు. ఈరోజు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని రాఖీపండుగను జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కా చెల్లెండ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు పలికారు.

సోదరీ, సోదరుల అనుబంధానికి ప్రతీక రాఖీ – కలెక్టర్‌ సిహెచ్.శివలింగయ్య
మహిళ, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ ను పురస్కరించుకొని బాలసదనంలోని చిన్నారులతో కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తన ఛాంబర్ లో రాఖీలు కట్టించుకున్నారు. అదే విధంగా అడిషనల్ కలెక్టర్, జిల్లా ఉన్నాతాధికారులకు, మీడియా ప్రతినిధులకు బాలికలు ప్రత్యేకంగా చేసిన రాఖీలు కట్టారు. అనంతరం చిన్నారులకు కలెక్టర్ స్వీట్లు తినిపించారు. కాసేపు పిల్లలతో ఆత్మీయంగా ముచ్చటించారు. బాగా చదువుకుంటున్నారా.. వసతులు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… సోదరీ, సోదరుల అనుబంధానికి ప్రతీక రాఖీ అన్నారు. ఆత్మీయుల మధ్య ఐకమత్యానికి పరస్పర చిహ్నంగా రాఖీ పండుగ చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ అబ్దుల్ హమీద్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా సివిల్ సప్లైయి ఆఫీసర్ రోజారాణి, డీఈఓ రాము, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, ఐసీపీసీ సిబ్బంది స్వప్నరాణి, ప్రణయ్, రాహుల్, హేమలత, బలసదనమ సూపర్ రెండిట్ వేరొనిక, సిబ్బంది స్రవంతి, భాగ్య, బలసదానం పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement