వాజేడు : గ్రామాలలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని అదేవిధంగా బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని వాజేడు ఎస్సై అశోక్ అన్నారు బుధవారం ఉదయం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ఏడూ జర్లపల్లి ముత్తారం కాలనీ గ్రామాలలో కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ అక్కడి ప్రజలకు చదువు యొక్క ప్రాధాన్యత గురించి బాల్యవివాహాల గురించి వివరించారు 18 సంవత్సరాల లోపు గల బాలికలకు వివాహాలు చేయకూడదని బాల కార్మికులను 14 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలబాలికలను ఎవరు కూడా మిర్చి పనులలో ఇతర పనులలో పెట్టుకోకూడదని అవగాహన కల్పించారు. ఎవరైనా 14 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాల బాలికలను పనిలో పెట్టుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. అదే విధంగా ఐదు నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాల బాలికలందరిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని సూచించారు.యువత మద్యం గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకూడదని పేకాట, కోడిపందాల వంటి చెడు వ్యసనాలకు ఎవరైనా పాల్పడితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు తలెత్తిన నేరుగా పోలీసులను సంప్రదించాలని మధ్యవర్తులను ఆశ్రయించకూడదని తెలిపారు ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు గ్రామాలలో అపరిచిత వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే ఈ కింది నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు సమాచారం అందించాల్సిన నెంబర్లు 1. 8712670096 2.8712670097 వాటిని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement